YSRCP Leader Road Damage:

అసలే కష్టకాలం. ఒకవైపు ఆర్థిక పరిస్థితి ఎక్కిరిస్తుంది. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కిందామీద.. నానా కష్టాలు పడి .. కేంద్రం చుట్టూ తిరిగి రాష్ట్రంలో మౌళిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే .. ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం విచ్చలవిడి తనంతో రెచ్చిపోతున్నారు. బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి చెందిన ఓనేత భాద్యత మరచి బుద్ధిలేని గాడిదలా ప్రవర్తించాడు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రం -పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య వారంరోజుల క్రితమే పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ. 4.75 కోట్లతో గ్రావెల్ రోడ్డు నిర్మించింది ప్రభుత్వం. అయితే ఆరోడ్డును వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి.. వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్‌తో రోడ్డును దున్నేశాడు (YSRCP Leader Road Damage). సుమారు 100 మీటర్ల రోడ్డు ధ్వంసం చేశాడు. ఆనేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఉపేక్షించేదే లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రోడ్డు ధ్వంసానికి పాల్పడిన వారిపై నాన్‌ బెయిలబుల్ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన రోడ్డుకు అయిన ఖర్చును వారి నుంచే వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఈదుర్మార్గపు చర్యకు పాల్పడిన వ్యక్తులతో పాటు వారి వెనుక ఉన్న శక్తులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. నిందితులను వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టాలన్నారు.

రోడ్డు ధ్వంసం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్డు వేస్తే .. ధ్వంసం చేయడం (YSRCP Leader Road Damage) పైశాచిక ఆనందమే అన్నారు. ఇది ఆపార్టీ ఉన్మాదానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కళ్లతో చూసి ఓర్వలేక పోతున్నారని .. అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ తనంగా వ్యవహరిస్తుంటే.. వైసీపీ శ్రేణులు మాత్రం విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉన్మాదులను క్షమించేదే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.