మాజీ సీఎం చంద్రబాబు కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై వాడివేడి వాదనలు జరిగాయి. ఈ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం గం. 2.00కు తదుపరి విచారణ జరుగుతుందని సుప్రీంకోర్ట్ వెల్లడించింది. కాగా మంగళవారం ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీపై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం మూడు ప్రశ్నలు సంధించింది. ఆ మూడు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గి సరైన సమాధానం చెప్పలేకపోయారు.శుక్రవారం ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయి నెలరోజులు అవుతోంది. అప్పటినుంచి బెయిల్ కోసం, క్వాష్ పిటిషన్ లు వేస్తూనే ఉన్నారు.