TPCC Chief Plans Report to High Command

కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ అంటే.. సుప్రీం. చివరికి ఆపార్టీ అధికారంలో ఉన్నా.. సీఎంను సైతం హ్యాండిల్ చేసేంత కెపాసిటీ పీసీసీది. అలాంటిది పీసీపీ మాటకే వ్యాల్యు లేకుండా పోయిందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. పీసీసీ ఆదేశిస్తే.. పరుగులు తీయాల్సి నేతలు.. కనీసం నీరసంగానైనా నడుచుకుంటూ రావడం లేదనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈముచ్చటంతా మాకేంటీ? అంటారా.. తెలంగాణ కాంగ్రెస్‌లో గత వారం రోజులుగా నడుస్తున్న వివాదం. ఢిల్లీ(TPCC Chief Plans Report to High Command)లో తన్నుకుంటే.. ఆలొల్లిపై గల్లీలో పంచాయితీ చేద్దామంటే ..కురదకపాయే. ఏంజరిగిందో? ఎలా జరిగిందో? ఎందుకు జరిగిందో తెలుసుకుందాం అంటే గొడవ పడ్డవారిద్దరూ ఇంటినుంచి బయటకు అడుగుపెట్టరే. పంచాయితీ చేద్దామని వచ్చి కూర్చున్న పెద్ద మనుషులు చివరకు చిరాకొచ్చి.. వెళ్లిపోయిన పరిస్థితి హైదరాబాద్ గాంధీభవన్‌ కనిపించింది. పార్టీ అధ్యక్షుడి పిలుపుకే మంత్రి, ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఢిల్లీ లొల్లి గల్లీలో..
ఇటీవల హస్తినలో మొదలైన ఆధిపత్య పోరు.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండియా కూటమి ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి దామోదర రాజనర్సింహా, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య శాంగ్రిల్లా హోటల్ లాబీ(TPCC Chief Plans Report to High Command)లో లొల్లి జరిగింది. ఇతర నేతల సమక్షంలో మంత్రి తనను దూషించారంటూ ఎమ్మెల్యే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని భావించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. గాంధీభవన్ వేదికగా పంచాయితీకి తెరలేపారు. ఇద్దరు నేతలకు కబురు పంపారు. స్వయంగా తానే పార్టీ కార్యాలయానికి చేరుకుని దాదాపు రెండున్నర గంటలపాటు ఎదురుచూశారు. కానీ అటు మంత్రి రాలేదు.. ఇటు ఎమ్మెల్యే అడుగుపెట్టలేదు. ఇద్దరు నేతల గైర్హాజరు ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడి పిలుపునే ఆఇద్దరూ నేతలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. అసలు పీసీసీ చీఫ్ మాటకు కాంగ్రెస్‌లో విలువ లేదా? లేక నేతల మధ్య అంతర్గత ఆధిపత్య పోరులో పార్టీ క్రమశిక్షణే బలైపోతోందా? అనే అనుమానం కలుగుతోంది.

హైకమాండ్‌కి రిపోర్ట్
ఒకవైపు మంత్రి హోదా.. మరోవైపు ఎమ్మెల్యే పదవి. ఇద్దరూ అధికార పార్టీలో కీలక ప్రజాప్రతినిధులే. కానీ పార్టీ అధ్యక్షుడు పిలిచిన సమావేశానికి హాజరుకాకపోవడం వెనుక ఎవరి లెక్కలు వారికున్నాయి. అనారోగ్య కారణాలతో రాలేనని మంత్రి దామోదర రాజనర్సింహా సమాచారం ఇచ్చినట్లు అఫీషియల్‌గా తెలుస్తుండగా.. తాను సీడబ్ల్యూసీ సభ్యుడినని, అధిష్టానంతోనే మాట్లాడుకుంటానని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక తనను అవమానించిన మంత్రే రానప్పుడు తాను ఎందుకు వెళ్లాలన్న భావనతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూడా పీసీసీ సమావేశానికి డుమ్మా కొట్టారనే టాక్ నడుస్తోంది. ఇద్దరి నేతల వస్తారని ఆశించి రెండున్నర గంటల నిరీక్షణించిన మహేష్ కుమార్ గౌడ్.. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడి పిలుపునే ఖాతరు చేయని నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. ఇద్దరి వ్యవహారశైలిపై పూర్తి వివరాలతో హైకమాండ్‌(TPCC Chief Plans Report to High Command)కు నివేదిక పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి పీసీసీ చీఫ్ పంపే ఈ నివేదికపై ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారా? లేక నేతల మధ్య వివాదాన్ని సర్దుబాటు చేస్తారా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే అసలు సస్పెన్స్!