టైగర్ ష్రాఫ్ కారుపై దుండగులు కాల్పులు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన అనిల్ పండిట్, హర్మాన్ సందు లు ఈ కాల్పులు జరిపించారని ప్రచారం జరుగుతోంది

Tiger Shroff Shooting Incident
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. బైక్ పై వచ్చి ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. 5 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. ముంబై జుహులో(Tiger Shroff Shooting Incident ) ఈ ఘటన జరిగింది.
తామే కాల్పులు జరిపినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది అని సోషల్ మీడియా లో ప్రచారం . ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ కి ఏమీ కాలేదు. అతని కారు డ్రైవర్, అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ కి గాయాలయ్యాయి.
ముంబై పోలీసులు ఈ కాల్పులు జరిపిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు 12 బృందాల్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ లను పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన అనిల్ పండిట్, హర్మాన్ సందు లు ఈ కాల్పులు (Tiger Shroff Shooting Incident )జరిపించారని ప్రచారం జరుగుతోంది.



