పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
2034నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు

Telangana Business Summit 2026
ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. 2034నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని(Telangana Business Summit 2026 ) చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బిజినెస్ సమ్మిట్ -2026లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రాచీన కాలంలో వస్తు మార్పిడిగా మొదలైన వాణిజ్యం.. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారిందన్నారు. ప్రపంచ మార్కెట్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇలాంటి వ్యాపార సమ్మెళనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కొత్త తరానికి మార్గనిర్దేశం చేసే వేదికగా ఈకార్యక్రమం నిలవడం అభినందనీయమన్నారు. వివిధ రంగాల్లో మున్నూరు కాపు సమాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట స్థానాలు సంపాదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు ఐదు శాతంగా ఉందని దానిని 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు సీఎం. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో ప్రతీ పారిశ్రామిక వేత్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశం స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో(Telangana Business Summit 2026 ) ముందుకు వెళ్తున్నారని సీఎం చెప్పారు. అదే దిశగా రాష్ట్ర అభివృద్ధిని మూడు ప్రధాన ఆర్థిక మండలాల ఆధారంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నా సీఎం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చూస్తూ ఐటీ, సేవారంగం, అత్యాధునిక రీజినల్ ఎకానమీగా అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలను రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా తీర్చిదిద్ది వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నామని చెప్పారు.



