RTC Bus Ticket Prices Increase: కరీంనగర్ జిల్లా కొత్తగట్టు టోల్ ప్లాజా ఎఫెక్ట్‌ ప్రయాణికులపై పడింది. టోల్‌ ప్లాజా ప్రారంభం కావడంతో ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. టోల్ చార్జీలను ప్రయాణికులపై రుద్దుతున్నారు ఆర్టీసీ అధికారులు. ఇంతకు ముందు కేశవపట్నం నుండి హుజురాబాద్‌కి 30 రూపాయల ఛార్జీ ఉండగా ఇప్పుడు అది రెట్టింపు అయింది. తాజాగా ప్రయాణికులనుంచి 60రూపాయలు వసూలు చేస్తున్నారు.

మరోవైపు హుజురాబాద్ నుండి వరంగల్ 70 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 90 రూపాయలకు పెరిగింది. టోల్ ప్లాజా పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని ప్రయాణికులు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. వెంటనే తగ్గించాలని.. లేదంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. టోల్‌ ప్లాజాకు తమకు ఏం సంభం అని ప్రశ్నిస్తున్నారు.