కొడంగల్‌కు భారీగా వరాలు.. రూ.9,053 కోట్లతో అభివృద్ధి పనులు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈపర్యటనలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, రహదారులు సహా పలు రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.

Revanth Kodangal Development Projects
అభివృద్ధికి శ్రీకారం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈపర్యటనలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, రహదారులు సహా పలు రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 13 అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు(Revanth Kodangal Development Projects) చేయనున్నారు. నవంబర్ 7న ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు సీఎం రేవంత్. 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 11.10 గంటలకు మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు, నూతన సాంకేతికత, సాగు విధానాలపై వారితో చర్చిస్తారు. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తర్వాత కొడంగల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
రూ. రూ.5,060 కోట్లతో రోడ్డు
రెండో రోజు నవంబర్ 8న ఉదయం హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అవుతారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. హకీంపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అలాగే బొంరాస్‌పేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పోలీస్ స్టేషన్.. కొడంగల్‌లో పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దుద్యాలలోను పోలీస్ స్టేషన్, సమీకృత మండల కార్యాలయ భవనాన్ని(Revanth Kodangal Development Projects) ప్రారంభిస్తారు. కొండల్ పర్యటనలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన రేడియల్ రోడ్డు-2 ను కోస్గి మండలం నాచారం దగ్గర ఈ రహదారి నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డులోని కొత్తవాల్‌గూడ నుంచి నాచారం దగ్గర జాతీయ రహదారి 167NH వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత కోస్గిలో సైన్స్ మ్యూజియాన్ని.. బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు.
50వేల మందితో సభ
కొడంగల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను విస్తరించే లక్ష్యంతో మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో 13 అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. వీటిలో రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2 నిర్మాణం కాగా.. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల నిర్మాణం, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులు చేయనున్నారు. విద్యా రంగానికి సంబంధించి రూ.118.80 కోట్లతో.. 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు..రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు కొడంగల్,(Revanth Kodangal Development Projects) కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇక చివరిరోజు నవంబర్ 9న హకీంపేటలో భారీ రైతు బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొడంగల్ నివాసం నుంచి బయలుదేరి హకీంపేటకు చేరుకుని ..అక్కడ జరిగే సభలో రాత్రి 7 గంటల వరకు పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభకు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాల నుంచి రైతులను సమీకరించేందుకు ఉమ్మడి జిల్లాల నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 వేల మంది రైతులను సమీకరిస్తున్నారు.



