HomeNewsస్పీడ్ మీదున్న తెలంగాణ బీజేపీ ... ఎన్నికల కమిటీలు ఇవే!

స్పీడ్ మీదున్న తెలంగాణ బీజేపీ … ఎన్నికల కమిటీలు ఇవే!

Published on

తెలంగాణలో 2023లో ఎన్నికలు జరగబోతున్నాయి. రెండురోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోంది. తెలంగాణలో అధికారం తమదేనని, టార్గెట్ 75 అంటూ బీజేపీ లక్ష్యం నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా ముందుకెళుతోంది. మిగతా పార్టీలతో పోలిస్తే అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ వెనుకబడి ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే మిగతా పార్టీల కంటే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల కోసం భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఇటు ప్రధాని మోడీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేశారు. కమల దళంలో ఉత్సాహం నింపారు. నిన్నమొన్నటివరకూ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఎవరు అనే నెంబర్‌ గేమ్‌లో బీజేపీ కాస్త వెనకబడినట్టైంది.

తాజాగా మోడీ టూర్ తర్వాత తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటిస్తూ.. ఛైర్మన్లు, కన్వీనర్లను నియమించింది తెలంగాణ బీజేపీ. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామిని, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా రాజగోపాల్ రెడ్డిని ప్రకటించింది. పబ్లిక్ మీటింగ్ చైర్మన్‌గా బండి సంజయ్, నిరసనల కమిటీ చైర్ పర్సన్‌గా విజయశాంతిని ప్రకటించింది. సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా ఎంపీ అర్వింద్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావును అనౌన్స్ చేసింది.మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా మహేష్ రెడ్డిని ప్రకటించింది.

అంతా అనుకున్నట్టుగానే మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు తెలంగాణలో అడుగుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. నిజామాబాద్‌ పర్యటనలో 8021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు శంకుస్థాపన చేశారు. 1200 కోట్లతో నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను, సిద్దిపేట–సికింద్రాబాద్‌ తొలి రైలు సర్వీసును ప్రారంభించారు. మోడీ టూర్ కమలదళంలో ఉత్సాహం నింపిందనే చెప్పాలి.

Latest articles

More like this