గిరిజనుల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు
42 ఎకరాలను కబ్జా చేశారని శామీర్ పేట పీఎస్లో ఫిర్యాదు
మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా వందలాది ఎకరాలు ఆయన కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి విషయంలో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పాలమ్మినా.. పూలమ్మినా అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. గిరిజనుల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు అందింది. 42 ఎకరాలను కబ్జా చేశారని శామీర్ పేట పీఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్చే మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ సాగుతోంది.మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది.ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.