HomeNewsAndhra Pradeshచంద్రబాబుకి నిరాశ.. మూడు పిటిషన్లు డిస్మిస్

చంద్రబాబుకి నిరాశ.. మూడు పిటిషన్లు డిస్మిస్

Published on

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది. ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. మొత్తం 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ డిస్మిస్ చేసినట్టయ్యింది. నిజానికి కోర్టులో చంద్రబాబు పిటిషన్లకు సంబంధించి అంగళ్లు కేసులో బెయిల్ రావొచ్చని భావించారు. ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకు కూడా ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసులో కూడా ఊరటదక్కలేదు.

Latest articles

More like this