స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్ధ్యంతర బెయిల్ మంజూరు అయింది.. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది.. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు జైలుకి వెళ్ళాలి. ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకూడదు. చంద్రబాబు జైలులో ఉండగా.. ఏ విధమయిన నిబంధనలు బయటకూడా వర్తిస్తాయి. ఆయన ఫోన్ కూడా మాట్లాడకూడదు. వైద్యుల పరిరక్షణలో ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అనుమతించబడతారు.