HomePoliticsబీఎస్పీ అభ్యర్ధుల లిస్ట్.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడినించి?

బీఎస్పీ అభ్యర్ధుల లిస్ట్.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడినించి?

Published on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయింది. రాష్ట్రంలోని ప్రధాని పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకుు వేట సాగిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. కాంగ్రెస్, బీజేపీ దరఖాస్తులు స్వీకరించి.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపట్టాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీఎస్పీ తమ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇవాళ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఎస్పీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఉండగా.. ఆయన వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుండి బరిలోకి దిగనున్నారు.బీఆర్ఎస్ తర్వాత బీఎస్పీ తమ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలచేసింది.

బీఎస్పీ అభ్యర్థుల జాబితా ఇదే:

సిర్పూర్ – డా.అర్. ఎస్. ప్రవీణ్ కుమార్

జహీరాబాద్- జంగం గోపీ

పెద్దపల్లి- దాసరి ఉష

దేవరకొండ – డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్

చొప్పదండి – కొంకటి శేఖర్

పాలేరు – అల్లిక వెంకటేశ్వర్ రావు

నకిరేకల్ – మేడి ప్రియదర్శిని

వైరా – బానోత్ రాంబాబు నాయక్

ధర్మపురి – నక్క విజయ్ కుమార్

వనపర్తి – నాగమోని చెన్న రాములు

మనకొండూరు – నిషాని రామచందర్

కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్

నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్

ఖానాపూర్ – బాన్సీలాల్ రాథోడ్

అందోల్ – ముప్పారపు ప్రకాష్

సూర్యాపేట – వట్టే జానయ్య యాదవ్

వికారాబాద్ – గోర్లకాడి క్రాంతి కుమార్

కొత్తగూడెం – ఎర్ర కామేష్

జుక్కల్ – ప్రద్య్న కుమార్ మాధవరావు ఏకాంబర్

Latest articles

More like this