HomeNewsAndhra Pradeshచంద్రబాబు అరెస్ట్ తో నాకు సంబంధంలేదు

చంద్రబాబు అరెస్ట్ తో నాకు సంబంధంలేదు

Published on

ఏపీలో సంచలనంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు.

తనకు చంద్రబాబు పై ఎలాంటి కక్షా లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందని.. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని అంటున్నాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా సగం రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వాళ్ళేనన్నారు. ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు అవినీతిని పసిగట్టి సీబీఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి వచ్చాయని జగన్ అన్నారు.

గతంలోనే చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వను అని తీర్మానం చేశారని, గజదొంగల ముఠా వీరప్పన్ అయిన బాబును సమర్ధించడం అంటే పేదవాడిని వ్యతిరేకించడమేనన్నారు. బాబును సమర్ధించడం అంటే నయా జమీందారి వ్యవస్థను సమర్థించటమేనన్నారు. మేం పేదల పక్షమయితే.. బాబుకి పెద్దల పక్షం అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయ పొత్తులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం పంచులు పేల్చారు. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానేనన్నారు. ఒకడు పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయ్యిందని.. అయినా ఇప్పటికీ నియోజకవర్గంలో నాయకులు లేరని జగన్ ఎద్దేవా చేశారు.

గ్రామాల్లో జనసేన జెండా మోసే కార్యకర్త లేడన్నారు. జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుందన్నారు. చంద్రబాబు మోసాల్లో, అవినీతిలో పార్ట్‌నర్ దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు దత్తపుత్రుడికి, తమ అనుచరులకు పంచుతున్నారన్నారు. రాజకీయం అంటే దోచుకోవడం, పంచుకోవటం, తినుకోవటం కాదన్నారు. చనిపొయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలనుకోవడం తన రాజకీయమన్నారు.

పేదవాడి చిరునవ్వులో మనం గుర్తుకు రావాలి అనుకోవడం తన రాజకీయమన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా లేదన్నారు. చంద్రబాబు అనగానే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు, వంచనలు అని జగన్ అన్నారు.పేదలు కలిసి పోరాటం చేయాలన్నారు. మన ధైర్యం మంచి చేయడమే అందుకే వైనాట్ 175 అంటున్నాను. మీకు మా ప్రభుత్వం వల్ల మంచి జరిగితే ఆశీర్వదించండి.. ఇలా ప్రతి ఇంటికీ వెళ్ళి అడిగే దైర్యం మీకు ఉందా అని ప్రతిపక్షాలను జగన్ ప్రశ్నించారు. మనం పొత్తు పెట్టుకోవాల్సింది ప్రజలతోనే.. ప్రజలే అన్నీ నిర్ణయిస్తారు అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Latest articles

More like this