తెలంగాణలో మరో సర్వే సంచలనంగా మారుతోంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు. ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం) అని తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్, 2023న (ఆదివారం) జరుగుతుందన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఏబీపీ, సీఓటర్ సర్వే ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ ఉండనుంది. బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు, కాంగ్రెస్‌కు 48 నుంచి 60 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో ముందున్నప్పటికీ బీజేపీ కేవలం 5 నుంచి 11 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది. 10.5శాతం పెరుగుదలలో కాంగ్రెస్ దాదాపు 39శాతం ఓట్ల వాటాను పొందగలదని తాజా సర్వే చెబుతోంది. 9.4శాతం ఓట్ల వాటా క్షీణతతో పాలక BRS 37%తో ఆ తర్వాతి స్థానాల్లో ఉంది.బిజెపికి 16% ఓట్లు, 9.3% ఓట్లు పెరుగుతాయని అంచనా వేయబడింది.