స్కామర్లు,సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు.. రకరకాల మార్గాల్లో ఫోన్లు చేస్తూ మాయ చేస్తున్నారు. డబ్బులు కొట్టేస్తున్నారు. మీకు ఐటీ రిఫండ్ వచ్చిందంటూ మెసేజ్ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్ పంపుతున్నారా?అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు బ్యాంకు అధికారులు. ఎందుకంటే ఐటీ రిఫండ్ల కోసం ఎదురుచూస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు.‘మీ బ్యాంక్ ఖాతా నంబర్ తప్పుంది..వెంటనే సరిచేసుకోండి’ అంటూ మెసేజ్‌లు పంపుతూ డబ్బు కాజేయాలని చూస్తున్నారు.అసలే రిటర్ను మొత్తం ఖాతాలో జమ అయ్యే సమయం కావడంతో చాలా మంది నిజం అనుకొనే ప్రమాదం ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రిటీ రిటర్ను దాఖలు చేసిన వారిని హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేసింది.
‘ఆదాయపన్ను (IT) రిటర్నులు ఆమోదం పొందాయంటూ మెసేజ్‌లు వస్తున్నాయి.ఇవన్నీ ఫేక్ మెసేజ్‌లు, ఆదాయ పన్ను శాఖ ఇలాంటి మెసేజ్‌లు ఎవ్వరికీ పంపదు. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవటం కోసమే ఇలాంటి మెసేజ్‌లు పంపుతుంటారు.వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్ చేసింది.దాంతో పాటూ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసింది.వ్యక్తిగత వివరాలు తెలపాలంటూ ఐటీ శాఖ ఎలాంటి మెసేజ్/మెయిల్ పంపబోదని తెలిపింది.ఒక వేళ మీకు అలాంటి మెసేజ్ వస్తే లింక్‌పై క్లిక్ చేయటం కానీ,వ్యక్తిగత సమాచారాన్ని చేరవేయటం కానీ చేయకండి అంటూ హెచ్చరించింది.ఒక వేళ పొరపాటున లింక్‌పై క్లిక్ చేసినా ఎలాంటి సమాచారాన్ని ఎంటర్ చేయవద్దని.. ఆ లింక్‌ను కాపీ చేసి మరో బ్రౌజర్ వెతకటం వంటివి చేయకూడదని కేంద్రం సూచించింది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం.