HomeNewsటీడీపీ బాటలోనే వైఎస్సార్టీపీ.. షర్మిల సంచలన నిర్ణయం

టీడీపీ బాటలోనే వైఎస్సార్టీపీ.. షర్మిల సంచలన నిర్ణయం

Published on

తెలంగాణలో పోటీ విషయమై వైఎస్సార్టీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయడంలేదని ప్రకటించారు షర్మిల.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే చరిత్ర నన్ను క్షమించదు.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయట్లేదు అన్నారు వైఎస్‌ షర్మిల. గత వారంలో 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని ప్రకటించాం.. ఈ వారంలో చాలా మార్పులు వచ్చాయి.. మళ్లీ కేసీఆర్ సీఎం అయితే ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది.. అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కష్టం, బాధగా ఉంది.. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం.. నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి.. వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు నన్ను అర్థం చేసుకోండి అని పేర్కొన్నారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.

పాలేరు నుంచి షర్మిల పోటీచేస్తారని, కొడంగల్ నుంచి తన భర్త అనిల్ పోటీచేస్తారని రెండురోజుల క్రితమే షర్మిల ప్రకటించారు. అయితే ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించింది షర్మిల. కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు… తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని… తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని… అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.

Latest articles

More like this