HomeNewsమద్యం ప్రియులకు బిగ్ షాక్.. ఆ మూడురోజులు మందు బంద్

మద్యం ప్రియులకు బిగ్ షాక్.. ఆ మూడురోజులు మందు బంద్

Published on

మందు బాబులం బాబు మందుబాబులం… మందుకొడితే మాకు మేమే మహారాజులం అంటాడో సినీకివి. తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు క్లోజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయనేతలు పెద్ద ఎత్తున మద్యం పంచే అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌కు రెండు రోజుల ముందే రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను ఎక్సైజ్ శాఖ మూసివేయనుంది.

Latest articles

More like this