HomeNewsచిటికెలో ఓటర్ ఐడీ.. ఎలాగో తెలుసా?

చిటికెలో ఓటర్ ఐడీ.. ఎలాగో తెలుసా?

Published on

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి ఏర్పడింది. అందునా తెలంగాణలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది ఎన్నికల పోలింగ్ ముందే తమ ఓటరు ఐడీ గురించి హైరానా పడుతుంటారు. ఎక్కడ పెట్టారో కొందరికి గుర్తుండదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ విధానంలో మొబైల్‌ నంబరు నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో మొబైల్‌ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్‌ అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్‌ చేసి నమోదు చేసిన తరవాత దరఖాస్తును సబ్‌మిట్‌ చేయాలి. ఆ తరవాత https://voters.eci.gov .in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్‌ నంబరు నమోదుచేశామో, ఆ ఫోన్‌ను ఓటీపీ వస్తుంది.

దాన్ని నమోదుచేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది. ‘ఆ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగా చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సదుపాయం గతంలోనూ ఉన్నప్పటికీ, అది ఆమోదం పొందేందుకు అధిక సమయం పట్టేది. నమోదిత వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తరవాత ఆ ప్రక్రియ పూర్తయ్యేది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను సరళతరం చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. మీదగ్గర ఎపిక్ కార్డు లేకుంటే వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి. దానిని ప్రింటవుట్ తీసి లామినేషన్ చేయించుకోండి.

Latest articles

More like this