ఎస్వీ శిల్ప కళాశాల ద్వారా యువతలో సంప్రదాయ స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.తిరుపతి అలిపిరి వద్దనున్న ఎస్వీ శిల్పా కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ ను టీటీడీ ఛైర్మన్ ప్రారంభించారు.మానవ నాగరిక జీవనంలో 30వేల సంవత్సరాల క్రితం శిల్పకళ ప్రారంభమైనదని .చరిత్రకు ఆధారం శిల్పాలు అని తెలిపారు. శిల్ప కళాశాల ద్వారా యువతలో నైపుణ్యత పెంచుతున్నామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పురాతన కలంకారి కళ ను రాష్ట్ర కళగా ప్రకటించేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని అన్నారు.
మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా రామిరెడ్డి, అశ్వర్థ నాయక్ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.