తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జిలను నియమించారు. ఆదిలాబాద్ లోక్ సభ ఇన్ ఛార్జిగా మంత్రి డి.అనసూయ సీతక్క, పెద్దపల్లికి మంత్రి డి.శ్రీధర్ బాబు, కరీంనగర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కి టి. జీవన్ రెడ్డి, జహీరాబాద్ కి పి.సుదర్శన్ రెడ్డి, మెదక్ కి మంత్రి దామోదర రాజనర్సింహ, మల్కాజ్ గిరికి మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, సికింద్రాబాద్ కి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ కికూడా భట్టి విక్రమార్క, చేవెళ్ళ, మహబూబ్ నగర్ సీటుకి సీఎం రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ కి మంత్రి జూపల్లి కిష్ణారావు, నల్లగొండకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కి మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మంకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను ఇన్ ఛార్జిలుగా నియమించారు.
