HomeNewsAndhra Pradeshసుప్రీంకోర్టుకి టీడీపీ..అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ

సుప్రీంకోర్టుకి టీడీపీ..అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ

Published on

మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ నేతల తదుపరి వ్యూహం ఏంటనేది సామాన్యుల మదిలో మెదులుతోంది. అయితే హైకోర్టు ఉత్తర్వులను టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోందిఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో జడ్జిమెంట్ కాపీలను పరిశీలించి శనివారం లేదా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్‌ను సుప్రీంకోర్టులో టీడీపీ సవాల్ చేయనుంది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు సీనియర్ లాయర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది.

దీంతో ఈరోజు లేదా రేపు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ సర్కారు అక్రమ కేసులను సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చంద్రబాబు లాయర్లు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారనే భయంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసును తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్‌ను నిరుత్సాహపర్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇటు అసెంబ్లీలో టీడీపీ తీవ్ర నిరసన తెలిపింది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.

Latest articles

More like this