HomeNewsతెలంగాణలో కాంగ్రెస్ కేబినెట్ ఇదే..?

తెలంగాణలో కాంగ్రెస్ కేబినెట్ ఇదే..?

Published on

తెలంగాణలో మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వేవ్ ఉందని, ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కే తెలంగాణ ఓటర్లు పట్టం కడతారని తెలిపింది. దీంతో తెలంగాణలో కొలువు తీరబోయే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో ఎవరు సీఎం అవుతారు? ఎవరు డిప్యూట సీఎం అవుతారు.. స్పీకర్ గా ఎవరు ఉంటారనేది లీక్ లు బయటకు వస్తున్నాయి.

మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి భద్రత పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 4వ తేదీన కేబినెట్ భేటీ ఉంటుందని కేసీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ చేసే కుట్రకు పాల్పడుతోందనీ, తమ కాంట్రాక్టర్లకు రైతు బంధు నిధులను చెల్లించేందుకు యత్నిస్తోందనీ అలా రైతు బంధు నిధులను దారిమళ్లిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నది ఇందుకోసమే అని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఓ కన్నేసి ఉంచాలనీ, ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ జరపకుండా చెయ్యాలని కోరుతోంది. దీనిపై ఇవాళ సీఈసీకి కంప్లైంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రైతు బంధు నిధులను మళ్ళిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలకు సముచిత ప్రాధాన్యత లభించేలా కేబినెట్ కూర్పు ఉంటుందని భావిస్తున్నారు.

Latest articles

More like this