HomeNewsమోడీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ మాది బీటీం....సీ టీం కాదు..టీ టీం

మోడీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ మాది బీటీం….సీ టీం కాదు..టీ టీం

Published on

తెలంగాణలో ఎన్నికల వేళ పార్టీల మధ్య విమర్శలు బాగా పెరుగుతున్నాయి. బీజేపీపై బీఆర్ఎస్, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తీవ్రమయిన ఆరోపణలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సి-టీమ్ అని మోడీ మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వేరు కాదన్న మోదీ… ఆ రెండు పార్టీలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు మోడీ. ఎవరు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో గమనించాలని పలువురు రాజకీయనేతలు సూచిస్తున్నారు. మేము బిజెపికి చెందిన బి-టీమ్ అని మీరు అంటున్నారు. మేము బి-టీమ్ కాదు. మీరు సి-టీమ్, చోర్ టీమ్ అంటూ ఇంతకుముందే కేటీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీఆర్ఎస్ పై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేసిన గుర్తుండే ఉంటుంది. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అంటూ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన ‘బీ’ టీమ్ అనిపిస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా..ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీని విస్తరించుకునే హక్కు ఉందని..అయితే బీఆర్‌ఎస్ను …. బీజేపీ బీ టీమ్ కాదా అనేది చూడాలన్నారు.

ఆరోజు నుంచి ఇప్పటివరకూ ప్రతి పార్టీ తమ ప్రత్యర్థి పార్టీని బీటీం అంటూనే ఉంది. ఈ బీటీం ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీగారు. మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు..మీరొచ్చి… మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు. మేం బీజేపీకి బీ టీమ్ కాదు
కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు.. మాది ముమ్మాటికీ T టీమ్.. తెలంగాణ టీమ్..తెలంగాణ ప్రజల హక్కుల కోసం..ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్. నిన్నటి దాకా మత రాజకీయం చేశారు !!నేడు కుల రాజకీయానికి తెర తీశారా ??పదేళ్ల మీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన… అరణ్య రోదనే అన్నారు కేటీఆర్. కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది..కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది..అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయే..బీసీలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు..కానీ.. మాకు బీసీలంటే.. బలమైన వర్గాలు.. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు..అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు..నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా ??దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ నే మించిపోయింది.. మీ బీజేపీ ప్రభుత్వం..ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు..రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరం.. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అంటూ కౌంటర్ అటాక్ చేశారు కేటీఆర్.

Latest articles

More like this