HomeNewsకాంగ్రెస్ లోకి తీన్మార్ మల్లన్న... ...

కాంగ్రెస్ లోకి తీన్మార్ మల్లన్న… ఏం ఆఫర్ ఇచ్చారో తెలుసా?

Published on

చింతపండు నవీన్ కుమార్ అంటే తెలంగాణలో చాలామందికి తెలీక పోవచ్చు. అదే తీన్మార్ మల్లన్న అంటే అందరికీ తెలిసిపోతుంది. తాజాగా తీన్మార్ మల్లన్న వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్న తీన్మార్ కార్యక్రమంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకు పెద్ద సంఖ్యలోనే ఓట్లు పడ్డాయి. మల్లన్న గతకొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వార్తలు రాగా వాటిని నిజం చేస్తూ ఆ ప్రచారానికి తెరదించారు. ఈ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానంటూ చెప్పారు. కానీ ఇప్పుడు సడన్ గా ఆయన కాంగ్రెస్ లో చేరారు. అటు కాంగ్రెస్ కూడా మేడ్చల్ అభ్యర్థిగా తోటకూర వజ్రేష్ యాదవ్ ను బరిలోకి దించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మల్లన్నకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. తీన్మార్ మల్లన్న చేరికతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగిందని కార్యకర్తలు అంటున్నారు. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. పటాన్ చెరు టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు ఆందోళన చేశారు.ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ కి టికెట్ ఇవ్వడంతో కాటా వర్గీయులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. పఠాన్ చెరు కాంగ్రెస్ లో మరింత ముదిరింది టికెట్ లొల్లి.. నీలం మధుకి ముదిరాజ్ కోటాలో టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఇక్కడ కాటా శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలని దామోదర రాజనర్సింహ పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. అవసరమయితే పార్టీని వీడేందుకు కూడా దామోదర రాజనర్సింహ సిద్ధపడుతున్నారు. మరోవైపు ఏఐసీసీ నేతలకు జగ్గారెడ్డి ఫోన్ చేశారు. పఠాన్ చెరు అభ్యర్థి నీలం మధుని మారిస్తే, నా నిర్ణయం నేను తీసుకుంటాను అని వెల్లడించారు జగ్గారెడ్డి. దీంతో ఏం చేయాలో తెలీక కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.

గతంలో మల్లన్న బీజేపీలో చేరి కొద్దిరోజుల్లోనే ఆయన బయటికి వచ్చారు.మార్నింగ్ న్యూస్ ద్వారా అయన గ్రామాల్లో ప్రజలకు మరింత దగ్గరయ్యారు.ప్రభుత్వం వైఫల్యాలపై తనదైన స్టైల్ లో విరుచుకూ పడుతూ ఉంటారు.ఆయనపై అనేక పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలు,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఅర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ల నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి …తీన్మార్ మల్లన్నపై 12,806 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితం చివరివరకూ దోబూచులాడింది. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి మల్లన్న మద్దతు తెలుపుతూ ఉండడంతో కాంగ్రెస్ నేతలు అతనితో చర్చలు జరిపారు.ఆ చర్చలు సఫలం కావడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు.ఇటు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తీన్మార్ మల్లన్న తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానని గతంలోనే ఛాలెంజ్ చేశారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ ఎన్నికల వేళ మల్లన్న చేరికతో కాంగ్రెస్ కి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూడాలి. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరటం హస్తానికి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Latest articles

More like this