విజయవాడలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గు లేదా అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడన్నారు. వరదల నుంచి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని గతంలో అనేక ధర్నాలు, జల దీక్షలు చేశామన్నారు.
2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కరకట్ట రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడు విడతలుగా 5 కిలో మీటర్లు మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని అప్పుడే చంద్రబాబు చెప్పారని గద్దె రామ్మోహన్ అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం తామే చేశామని సజ్జల చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అక్కడి ప్రజలను అడిగితే ఎవరు ప్రారంభించారో చెబుతారన్నారు. అసెంబ్లీలో స్పీకర్ మా గొంతు నొక్కుతున్నారన్నారు. వాస్తవాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. విజయవాడను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు.విజన్ అనే పదానికి అర్థం తెలియని వైసీపీ నాయకులు తమపై విమర్శలు చేయడం ఏంటన్నారు. అవినీతి జరిగింది అని ప్రచారం కాదు నిరూపించండి. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్టు గుర్తించిన ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. అమరావతి లో అక్రమాల పై దమ్ముంటే నిరూపించాలి. రేపో మాపో మూసేసి పార్టీ వైసీపీ అన్నారు గద్దె. 50కోట్లు జగన్ ప్రభుత్వం కాజేస్తే సాక్షాలతో బయట పెట్టిన టిడిపి. జగన్ ను ప్రజా కోర్టు లో నిలబెడతాం అన్నారు.