స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంటు కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగింపు.. 41 ఎ నోటీసులు ఇచ్చామని.. నిబంధనలు పాటిస్తామని తెలిపిన ఏజీ.. 41 ఏ నోటీసులతో అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్ పై విచారణ ముగిసిందన్నారు జడ్జి.