HomeNewsAndhra Pradeshహైకోర్టులో బాబుకి తాత్కాలిక ఊరట

హైకోర్టులో బాబుకి తాత్కాలిక ఊరట

Published on

ఏపీ హైకోర్టులో మాజీ సీఎం చంద్రబాబుకి తాత్కాలిక ఊరట లభించింది. గత 33 రోజులుగా చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేయగా బుధవారం ఉదయం విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు.. అటు సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. దీంతో చంద్రబాబుకు కొంత ఊరట దక్కినట్లు అయ్యింది.ఈ కేసును ప్రస్తుతం అదనపు ఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన స్ధానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్‌ను నియమిస్తూ సీఐడీ నిర్ణయం తీసుకుంది.

Latest articles

More like this