రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన మరో రెండు వారాల పాటూ మూతపడుతోంది. రోడ్ కం రైలు బ్రిడ్జి మూసివేతను మరో రెండు వారాలు పొడిగించినట్లు తెలిపారు అధికారులు. మరమ్మతులు ఇంకా పూర్తికా కపోవడంతో వచ్చే నెల 10 వరకూ బ్రిడ్జిపై రాకపోకలు నిషేధిస్తున్నట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు. గత నెల 27 వ తేదీ నుంచీ వంతెనపై ట్రాఫిక్ నిలిపివేసి సు మారు 2 కోట్ల నిధులతో మరమ్మత్తుల పనులు చేస్తు న్నారు.మొదట్లో అక్టోబరు 26వ తేదీ వరకూ బ్రిడ్జిపై రాకపోకలు నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు విడు దల చేశారు. అయితే ఆ గడువు నేటితో ముగుస్తుం డడంతో ఆర్అండ్బీ అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నా మని కలెక్టర్ మాధవీలత తెలిపారు.
ఇప్పటికే బ్రిడ్జి మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఎప్పుడెప్పుడు బ్రిడ్జి తెరుస్తారా అని చాలా మంది ఎదురు చూస్తున్న తరుణంలో నిషేధాన్ని పొడి గించడం నిరాశకు గురి చేసింది.బ్రిడ్జిపై నిషేధం గడువు మరో రెండు వారాలు పొడిగించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.