ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. poll trend and strategies సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కి 65-68 సీట్లు రానున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 35 నుంచి 40 సీట్లు రానున్నాయి. బీజేపీకి 7-10 సీట్లు, ఎంఐఎం కి 6-7 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 1 -2 వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.




