HomeNewsయాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్

యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్

Published on

గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇబ్రహీంపట్నం మరియు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సంయుక్తంగా గురు నానక్ విద్యాసంస్థలో “యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్” నిర్వహించాయి. రాష్ట్రంలోని కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులకు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ముఖ్య అతిదులుగా విచ్చేసిన శ్రీమతి డి. సునీతారెడ్డి, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSANB) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ పి), శ్రీ.జి. చక్రవర్తి, పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ పి) టి ఎస్ ఏ యెన్ బి, వారి ఆధ్వర్యంలో జరిగింది.


కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్‌ దుర్వినియోగంపై షార్ట్‌ ఫిల్మ్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ముఖ్యఅతిథులు ప్రదర్శించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ, వైస్ చైర్మన్-గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్, డాక్టర్ హెచ్.ఎస్. సైనీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ కొడుగంటి వెంకట్‌రావు, జిఎన్‌ఐటిసి డైరెక్టర్‌, జిఎన్‌ఐటి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీనాథరెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.పార్థసారధి, అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రిషి సయాల్, ఇతర పోలీసు సిబ్బంది మాట్లాడారు.


ముఖ్యఅతిధులు మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉన్నందున పొరుగున ఉన్న శత్రు దేశాలు యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలకు, మత్తు మందుకు బానిసలుగా చేస్తూ మన దేశ భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. డ్రగ్స్ ద్వారా దేశంలోని యువతను నిర్వీర్యం చేయడమే ఆ దేశాల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో, కళాశాలల విద్యార్థుల్లో డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి అవగాహన ఏర్పరచి “మిషన్ పరివర్తన్”ని తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తోందని వారు తెలిపారు. ప్రతి విద్యార్థి తనకు తానె సైనికుడిలా, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా భావించి స్పృహ కలిగి ఉండాలని, మెరుగైన మరియు డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.

డ్రగ్స్ దుర్వినియోగానికి దారితీసే ఒత్తిడిని అధిగమించడానికి వారు యోగా మరియు రోజువారీ శారీరక వ్యాయామాలను చేయాలనీ సూచించారు. సుబ్బరామి రె డ్డి, డి ఎస్ పి, టి ఎస్ ఏ యెన్ బి, తన స్పూర్తిదాయకమైన మరియు ప్రేరణాత్మక ప్రసంగంలో, జీవితాంతం క్రుంగి పోయేవిదంగా డ్రగ్స్ కు అలవాటుపడటం అనే తప్పులు ఎప్పుడూ చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ క్యాంపస్‌లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించినందుకు గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో టి ఎస్ ఏ యెన్ బి, డిఎస్పి, శ్రీ బి. రమేష్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సి ఐ) శ్రీ పి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే డ్రగ్స్‌కు బానిసలైన వారిని ఆదుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 14446 నిరంతరం పనిచేస్తోందని, విద్యార్థులు మాదకద్రవ్యాలకు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 8712671111ను ఉపయోగించాలని వారు సూచించారు. జిఎన్ఐటిసి, జిఎన్ఐటి నుండి రెండు సెషన్లలో జరిగిన ఈ ఈవెంట్‌లో 1500 మందికి పైగా విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. అంజయ్య, ప్రొఫెసర్, మెకానికల్ డిపార్ట్మెంట్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, విద్యార్థులకు. అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest articles

More like this