HomeNewsబీఆర్ఎస్ లోకి విష్ణువర్థన్ రెడ్డి..హరీష్ రాయబారం

బీఆర్ఎస్ లోకి విష్ణువర్థన్ రెడ్డి..హరీష్ రాయబారం

Published on

జూబ్లిహిల్స్ టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి పార్టీ మారనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీలో విష్ణు చేరిక తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌లో చేరికకు విష్ణువర్ధన్ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది జనాలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డారని.. తాము విష్ణు అందరం ఐదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని హరీష్ రావు తెలిపారు. అనేక ఉద్యమాల్లో విష్ణు తమతో కలిసి పోరాడారని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు విష్ణు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనపడుతోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్ రాలేదని బీఆర్ఎస్ లో చేరేందుకు మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్థన్ రెడ్డి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. తాజాగా విష్ణు కూడా బీఆర్ఎస్ లో చేరితే ఆయనకు ఏ పదవి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

Latest articles

More like this