దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల సందడి నెలకొంది. ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సెషన్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.. ఏమేం బిల్లులు తీసుకురాబోతోంది? అనే హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో సెషన్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ సమయం తక్కువగానే ఉంటుందని, కానీ ఇది చరిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు. అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతోందన్నారు. విశ్వాసం, ఉత్సాహంతో ఈ సెషన్ ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు విజయవంతమైందని, మనదేశ ఖ్యాతి ప్రపంచం గుర్తించిదన్నారు. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ విజయం యావత్ భారత జాతిది అన్నారు. మూన్ మిషన్ యొక్క విజయం దేశ జెండాను ఎగురవేసిందన్నారు. శివశక్తి పాయింట్ కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారుతుందన్నారు. అంతకుముందు మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషిలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో ఎజెండాపై చర్చించారని సమాచారం.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer