HomeNewsగీతమ్ లో ఘనంగా ఓనం వేడుకలు

గీతమ్ లో ఘనంగా ఓనం వేడుకలు

Published on

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్శిటీలో ఓనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేరళ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఓనం పండుగ అత్యంత గౌరవప్రదంగా జరుపుకునే పంటల పండుగగా చెబుతారు. ఓనం ను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు బుధవారం ఘనంగా నిర్వహించారు. ‘సింఫనీ ఆఫ్ హార్మోనీ’ (భిన్న సమూహాల సామరస్యం) ఇతివృ త్తంగా ఈ ఏడాది ఓనంను నిర్వహిస్తున్న విషయం విదితమే.

సంప్రదాయ దుస్తులు ధరించి, ధవళ వర్ణంలో మెరిసిపోతున్న గీతం విద్యార్థులు, మనదేశం గొప్ప సాంస్కృ తిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఓనం ఉత్సవాలను జరుపుకున్నారు. చూడచక్కని సంప్రదాయ వస్త్రాలతో శివాజీ ఆడిటోరియం ముందున్న హాలులో సంప్రదాయ దుస్తుల్లో కలియ తిరుగుతూ, వివిధ రకాల వంటకాలను సిద్ధం చేసి ఓనం పండుగ రుచులను ఆస్వాదించారు. శివాజీ ఆడిటోరియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది విద్యార్ధినులు, విద్యార్దులు పాల్గొన్నారు.

Latest articles

More like this