ప్రతిసారి ఎన్నికల ముందు జనాన్ని ఆకట్టుకునే పనిలో పడుతుంది కేంద్రప్రభుత్వం… భారీగా పెంచిన సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిలెండర్ ధర రూ.200 మేరకు తగ్గించనుందని, రాబోయే 24 గంటల్లో కేంద్రం ఈ మేరకు కీలక ప్రకటన చేయనుందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనుంది. నిత్యావసరాల ధరలన్నీ గత కొద్ది నెలలుగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు కాసింత ఉపశమనం కలిగించే పనిలో పడింది కేంద్రం. ఎల్‌పీజీ సిలెండర్ ధరను తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.
సిలెండర్ ధర రూ.200 మేరకు తగ్గించనుందని, రాబోయే 24 గంటల్లో కేంద్రం ఈ మేరకు కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలెండర్ ధర హైదరాబాద్ లో రూ.1,150 వరకూ ఉంది. 100 నుంచి 200 వరకూ తగ్గించే అవకాశాలున్నాయని అంటున్నారు.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పలు ఎన్నికల హామీలు ఇచ్చారు. రూ.450 కే సిలెండర్ ఇస్తామన్న హామీ ఇందులో ఒకటి. శ్రావణ మాసంలో సిలెండర్ రూ.450కే ఇస్తున్నామని, 1.25 కోట్ల మంది మహిళలకు రూ.250 చొప్పున వారి అకౌంట్లకు నేరుగా వేస్తున్నామని ప్రకటించారు. ఈనేపథ్యంలో మోడీ కూడా ఇదే తరహాలో సిలిండర్ ధర తగ్గించే అవకాశం కనిపిస్తోంది.