తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో సర్వే సంస్థ ఫలితాలను వెల్లడించింది. మిషన్ చాణక్య ఎలక్షన్ స్టడీ సంస్థ స్టేట్ మూడ్ ను విడుదల చేసింది. నారాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం పేరుతో చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని తేల్చింది. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం చేపట్టబోతుందని తెలిపింది. బీఆర్ఎస్ కు 44.62 శాతం, కాంగ్రెస్కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం ఓట్లు వచ్చే చాన్స్ ఉందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 72 నుంచి 76, కాంగ్రెస్ 25 వరకు, బీజేపీ 9 నుంచి 10, ఎంఐఎం ఏడు సీట్లు గెలుస్తుందని పేర్కొంది. మేనిఫెస్టో విడుదల తరువాత బీఆర్ఎస్కు మహిళల్లో ఆదరణ పెరిగిందని, అత్యధికంగా 37శాతం మంది నిరుద్యోగులు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పింది. గ్యారంటీలతో కాంగ్రెస్ కాస్త పుంజుకుందని, అయినప్పటికీ ఆ పార్టీ రెండో స్థానానికే పరిమితం అవుతుందని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉందని తెలిపింది. ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని తెలిపింది.
మిషన్ చాణక్య చైర్మన్ అముక శివకేశవ్ మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి స్టేట్ మూడ్ ని అబ్జర్వ్ చేశామన్నారు. ఈ సర్వే కోసం రాష్ట్రంలో నాలుగు నెలల పాటు శ్రమించి, 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. అధికార పార్టీకి 41.62 శాతం, కాంగ్రెస్ పార్టీకి 32.7 శాతం, బీజేపీకి 17.6 శాతం ప్రజలు మద్దతు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఓటింగ్ జరిగితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కనీసం 76 చోట్ల గెలుస్తుందని తేలింది. ఈమేరకు నా రాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్లు మిషన్ చాణక్య వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి.. మరీ ముఖ్యంగా మేనిఫెస్టో విడుదల చేశాక మహిళల నుంచి భారీగా మద్దతు వ్యక్తమైందని తేలింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై 85 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 44.62 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.స్తున్నామన్నారు. కొన్ని పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు కనుక వారిని కూడా ప్రకటిస్తే ఎన్నికల సమయానికి ఈ అంచనాలు మారవచ్చని చెప్పారు.
మిషన్ చాణక్య సర్వే ప్రకారం.. సామాజిక వర్గాలవారీగా తీసుకొంటే బీఆర్ఎస్కు బీసీలు 45.97, ఓసీలు 41.20, ఎస్సీలు 43.17, ఎస్టీలు 44.45 శాతం, మైనార్టీలు 48.31 శాతం చొప్పున మద్దతుగా నిలుస్తున్నారు.బీజేపీకి 24.60 శాతం మంది బీసీలు మాత్రమే మద్దతిస్తున్నారు. ఇక ఓసీలు 24.89, ఎస్సీలు 16.60, ఎస్టీలు 16.41, మైనార్టీలు 5.52 శాతం మాత్రమే ఆ పార్టీ పట్ల సర్వేలో సానుకూలత వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అన్ని వర్గాల మద్దతును పొందలేకపోతున్నది. ఆ పార్టీకి బీసీల అండ 26.70శాతం మాత్రమే కాగా, ఓసీలు 29.62, ఎస్సీలు 33.67, ఎస్టీలు 37.16,, మైనార్టీలు 36.41శాతం మాత్రమే అనుకూలంగా ఉన్నారు.మైనార్టీల్లో ముస్లింలు 48.32, క్రిస్టియన్లు 50.23, ఇతర మైనార్టీలు 46.38 శాతం బీఆర్ఎస్కే జై కొడుతున్నారు.కార్మికుల్లో 44.14, గృహిణుల్లో 50.29, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 38.97, ప్రైవేట్ ఉద్యోగుల్లో 38.95, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 40.35, నిరుద్యోగుల్లో 37.98, వ్యాపారుల్లో 43.34, విద్యావేత్తల్లో 45.08శాతం ఓటర్లు గులాబీ పార్టీవైపే ఉన్నారు.ఆసరా పెన్షన్దారుల్లో 52.13 శాతం, దివ్యాంగుల్లో 51, రైతుల్లో 48.52 శాతం ప్రభుత్వ పట్ల సానుకూలంగా ఉన్నారు.ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 11.91 శాతం. ఒక్కోసారి ఓట్ల శాతం రెండు, మూడు శాతం ఉండగా ఫలితాల్లో భారీ తేడాలుంటాయి. ఇప్పటికే లోక్ పోల్, ఏబీపీ సీ ఓటర్, ఇండియా టుడే సీ ఓటర్ సర్వేల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని తెలిపింది. తాజా సర్వే బీఆర్ఎస్ కి మొగ్గుచూపడం విశేషం. దీంతో గులాబీ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి.