తెలంగాణ వాసులకు భారీ గుడ్ న్యూస్..
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు తేదీ విడుదల
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనం
ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్
ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ ప్రకటన
మీరు తెలంగాణ వాసులా? ..కొత్త రేషన్ కార్డు కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అయితే మీకిది గుడ్ న్యూస్. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ముఖ్యమైన 2 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు మార్చారు. తాజాగా, కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర్ 28 తేదీ నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారని, అందులో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణతో పాటు, ఇది వరకే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరి చేయడం వంటి వాటిని కూడా అవకాశం ఇవ్వనుంది. ఈ గ్రామ సభల్లోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేయడం, పింఛను దరఖాస్తుకూ అవకాశం ఇవ్వడం, హౌసింగ్ పైన లబ్ధిదారుల నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.