తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని NEWS 18 సర్వేలో వెల్లడైంది. అధికార BRS పార్టీకి 48 సీట్లు మాత్రమే రావచ్చని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 56 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాగా BJPకి 10 సీట్లు, ఎంఐఎం 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. 70కి పైగా స్థానాలతో భారాస అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందన్నారు. ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని అనుకోవట్లేదన్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరిగిందన్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్‌కే ఓటమి తప్పదని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మతంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి తప్పదని సర్వేలో వెళ్లడైంది. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంటకరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిసింది.మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని ఆరా మస్తాన్ సర్వే సంస్థ తెలపడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్న తెలంగాణ ఓటర్లు – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 62-72, బీఆర్ఎస్ 35-46, బిజెపి 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలు – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
- కాంగ్రెస్ పార్టీ 42.7, బీఆర్ఎస్ 37.8, బిజెపి 13.2, ఎంఐఎం 2.5 శాతం ఓట్లు సాధించే అవకాశం – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
-కాంగ్రెస్ 4.9 శాతం ఓట్లు అధికార బీఆర్ఎస్ పార్టీపై ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయి – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ - పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా 5 వేల సాంపిల్స్‌తో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్ నిర్వహించింది.
- తెలంగాణలోని 33 జిల్లాల్లో కాంగ్రెస్‌పార్టీ 21 జిల్లాలో, బీఆర్ఎస్ 11 జిల్లాల్లో ఓట్ల శాతం ప్రకారం ఆధిక్యంలో ఉన్నాయి – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
- బిజెపి కేవలం నిర్మల్ జిల్లాలో మాత్రమే ఓట్ల శాతం ప్రకారం తన ఆధిక్యత కొనసాగించే అవకాశాలున్నాయి – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
- రాష్ట్రంలో మెజార్టీకి కావాల్సిన స్థానాలు 60 – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్
- ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి మరింత బలంగా వీస్తే మరిన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి – పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్