ఈమధ్యకాలంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు మత పరమయిన కేంద్రాలను ఎంచుకుంటున్నారు. మహారాష్ట్రలోని ధూలేలో రద్దీగా ఉండే ఆలయంలోకి ఓ సాయుధ “ఉగ్రవాది” ప్రవేశించాడు. అతడిని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారంతా. అయితే అక్కడే ఉన్న వ్యక్తి రైఫిల్‌తో ఉన్న ఉగ్రవాది దగ్గరికి వెళ్లి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు.మహారాష్ట్రలోని ధూలే నగరంలోని రద్దీగా ఉన్న స్వామినారాయణ ఆలయంలోకి చేతిలో రైఫిల్, ముఖంపై నల్లటి గుడ్డ కప్పుకున్న వ్యక్తి ప్రవేశించినప్పుడు భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అకస్మాత్తుగా ‘ఉగ్రవాది’ ప్రత్యక్షం కావడంతో సందర్శకుల్లో కలకలం రేగింది.
దీంతో ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఉగ్రవాది చెంప చెళ్లుమనిపించాడు.కాసేపటి తర్వాత, ఇది నిజమైన ఉగ్రవాద పరిస్థితి కాదని, తాము నిర్వహించిన డ్రిల్ అని పోలీసులు ప్రజలకు తెలియజేశారు. ఇటువంటి పరిస్థితులలో పౌరుల అప్రమత్తతను గమనించడం డ్రిల్ యొక్క ఉద్దేశ్యం. ఇది పోలీసుల డ్రిల్ అని, టెర్రరిస్టుగా నటిస్తున్న వ్యక్తి పోలీసు అని తెలియగానే ప్రశాంత్ కులకర్ణి (35) అనే వ్యక్తి కోపం చల్లారింది. పోలీసులు చేస్తున్న ఇలాంటి కసరత్తులు పౌరులను భయాందోళనకు గురిచేస్తున్నాయని పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక్కోసారి ఇలాంటి ఘటనలు నిజమేనేమో అనిపిస్తాయి.