అగ్నిప్రమాదాలు భారీ నష్టాలకు కారణం అవుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్‌బర్గ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌లోని ఒక అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం కావడం శోచనీయం. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి, సహాయకచర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఇలాంటి ఊరూపేరూ లేని బిల్డింగ్స్ చాలానే ఉన్నాయని, వాటిని సిటీ అధికార యంత్రాంగం ‘హైజాక్డ్ బిల్డింగ్స్’గా వదిలేయడం వల్లే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.