HomeNewsఎగ్జిట్ పోల్స్ ని కొట్టిపారేసిన కేటీఆర్

ఎగ్జిట్ పోల్స్ ని కొట్టిపారేసిన కేటీఆర్

Published on

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చేశాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని పలు సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తిరిగి డిసెంబర్ 3న సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తారన్నారు.

ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్‌ 3న ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు.

పల్స్ టుడే

బీఆర్ఎస్ : 69-71

కాంగ్రెస్ : 37-38

బీజేపీ : 03-05

ఎంఐఎం : 06

ఇతరులు : 01

జన్‌కీబాత్‌..
భారాస 40 నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్‌ 48 నుంచి 64 స్థానాలు, భాజపా 7 నుంచి 13 స్థానాలు, ఎంఐఎం 4 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది.

Latest articles

More like this