కేఏపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన మా పార్టీలోకి వస్తే.. ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ…‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన , ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేక పోయారు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తానని ఏసు క్రీస్తు చెప్పారు. చాలా మందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదు. ఏసు క్రీస్తు తర్వాత ఇలాంటి రక్షకుడు పుట్టలేదు. లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయింది. క్రిస్మస్ సందర్భంగా నిరాశ్రయులకు, ఆహారం దుప్పట్లు పంపిణీ చేశాం’’ అని కేఏ పాల్ తెలిపారు.
మరోవైపు కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ ని కలిశారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయపరిణామాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. జనవరి 1న సెలవు ఇచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించింది. కాగా డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కాబట్టి ఆరోజు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు అలసిపోతారని.. అందుకే వాళ్ల సౌలభ్యం కోసం జనవరి 1న సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.