HomeNewsAndhra Pradeshగన్నవరం రాజకీయం గరం.. గరం

గన్నవరం రాజకీయం గరం.. గరం

Published on

ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కీలక నియోజకవర్గంగా మారిన గన్నవరంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తుది విడత చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు నేడు వారితో సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గన్నవరంలో ప్రస్తుత పరిస్థితులను వైసీపీ నేతలుగా జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు.

తాను ఇండిపెండెంట్‌గా పోటీచేయాలా? లేక టీడీపీలో చేరాలా? అనే విషయంలో యార్లగడ్డ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ముఖ్య అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం యార్లగడ్డ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుగా నిలవడంతో నాడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంది. రెండ్రోజులకోసారి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఇద్దర్నీ కలిపినప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడటంతో టికెట్ విషయంలో మళ్లీ రచ్చ రచ్చ జరుగుతోంది.

Latest articles

More like this