HomeNewsAndhra Pradeshబాలయ్య సీమ సింహానికి.. జగన్ కు లింకేంటి?

బాలయ్య సీమ సింహానికి.. జగన్ కు లింకేంటి?

Published on

రాజ‌కీయ నాయ‌కులు సినిమాల‌కు పెట్టుబ‌డులు పెట్ట‌డం. నిర్మాత‌లుగా మారి సినిమాలు నిర్మించ‌డం అనేది కొత్తేమి కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కామన్ అయిపోయిది. అయితే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కూడా ఒక‌ప్పుడు సినిమాలంటే బాగా ఇష్టం అని మీకు తెలుసా?నందమూరి బాల‌కృష్ణ అభిమానం సంఘం క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడిగా జగన్ పనిచేశారు. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు సినిమాలు వ‌చ్చిన టైంలో  క‌డ‌ప జిల్లా బాల‌య్య ఫ్యాన్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌జగన్. అంతేకాదు బాల‌య్య న‌టించిన సీమ సింహం సినిమా సీడెడ్ రైట్స్ కొని దానిని పంపిణి కూడా చేశారు జగన్. 2002 సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ విడుదలైంది. సీమ‌సింహం సీడెడ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు జ‌గ‌న్‌కు రాజ‌శేఖ‌ర్ రెడ్డి సాయం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంచ‌నాలు అందుకోలేదు.

Latest articles

More like this