‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఎలా ఉండాలో పకోడిగాళ్ల సలహాలు తన వాళ్లకు ఇచ్చుకుంటే మంచిది అని హితవు పలికారు.
రాజకీయాలు మనకెందుకు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని సూచించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘యాక్టర్ల రెమ్యూనరేషన్పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలంటూ’ చిరంజీవి హితవు పలికారు.దీనిపై నాని ఈవిధంగా స్పందించారు.