HomeNewsబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి షాక్.. జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి షాక్.. జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు

Published on

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు విద్యుత్ అధికారులు సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలో.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ శాఖకు విద్యుత్ బకాయి ఉండడంతో గతంలో నోటీసులు అందించారు. అయితే.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు.

Latest articles

More like this