లాకప్ డెత్ లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందునా దేశవ్యాప్తంగా జరుగుతున్న లాకప్ డెత్ లు కలవరం కలిగిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు లాకప్ డెత్ల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ అందించిన వివరాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. దేశంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.
2018 నుంచి 2023 మార్చి 31వ వరకు నమోదైన వివరాల ప్రకారం, గుజరాత్లో 81, మహారాష్ట్రలో 80, మధ్య ప్రదేశ్‌లో 50, బిహార్‌లో 47, ఉత్తరప్రదేశ్‌లో 41, వెస్ట్‌బెంగాల్‌లో 40 అని వరుసగా మొదటి ఆరు స్థానాల్లో ఉత్తరరాది రాష్ట్రాలు నిలిచాయి. జాతీయ స్థాయిలో 7వ స్థానం, దక్షిణ రాష్ట్రాల్లో మొదటిస్థానాన్ని తమిళనాడు పొందింది. రాష్ట్రంలో 2018-19లో 11, 2019-20లో 12, 2020-21లో 2, 2021-22లో 4, 2022-23లో 7 అని మొత్తం 36 లాక్పడెత్లు నమోదయ్యాయని మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. లాకప్ డెత్ లలో మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ దేశంలో అగ్రస్థానంలో ఉంది.