HomeNewsఅసంతృప్తిలో దామోదర రాజనర్సింహ…కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

అసంతృప్తిలో దామోదర రాజనర్సింహ…కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

Published on

కాంగ్రెస్ పార్టీ టికెట్ల లొల్లి గందరగోళానికి కారణం అవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై దామోదర రాజనర్సింహ చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని రాజనర్సింహ చెబుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్ కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అనేకమార్లు సూచించారు.

సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. పటాన్ చెరులో నీలం మధు ముదిరాజ్ కి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. నారాయణఖేడ్ నుండి సురేష్ కుమార్ కి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. సోమవారంనాడు రాత్రి కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాను సూచించిన అభ్యర్ధులు కాకుండా వేరే వాళ్లకు కాంగ్రెస్ నాయకత్వం టిక్కెట్లు కేటాయించడంతో దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై దామోదర రాజనర్సింహ అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest articles

More like this