తెలంగాణ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో … శుక్రవారం ఉదయం జగిత్యాలలో కరీంనగర్-పార్క్ నుంచి మూడో రోజు కాంగ్రెస్ విజయ భేరి యాత్ర ప్రారంభమైంది. జగిత్యాల కార్నర్ సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన రాహుల్ గాంధీ జగిత్యాల మార్గమధ్యంలో నూకపల్లి ఎన్ఎసి స్టాప్ వద్ద ఆగారు. అక్కడ స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ పంచారు.
ఆ తరువాత పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్దకు వెళ్లారు. దోశ తినాలంటే ఎంత డబ్బు కట్టాలంటూ .. హాస్యమాడారు. ” నువ్వు కాదు నేను కూడా దోసె వేయొచ్చా.. ” అని అడిగారు. దీంతో ఆ బండి యజమాని ” దానికేమి భాగ్యం వేయండి సార్ ” అంటూ పక్కకు జరిగాడు. ” నాకు దోస వేయడం రాకపోతే నేర్పిస్తావా ” అంటూ అనడంతో కాసేపు అక్కడి వాతావరణమంతా నవ్వులతో నిండింది. రాహుల్ గాంధీ దోశెలను వేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత రాహుల్ గాంధీ తిరిగి జగిత్యాల సదస్సుకు బయలుదేరి వెళ్ళిపోయారు. అంతేకాదు తాను వేసిన దోశెలు ప్లేట్లో పెట్టి ఇవ్వగా హాయిగా తిన్నారు. పనిలో పనిగా అక్కడే ఉన్న మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా దోశె ఆఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ తో పాటు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాహుల్ దోశె వేస్తున్న వీడియో వైరల్ గా మారింది. దోశలు వేసి తెలంగాణ మనసులు దోచేస్తారా అని అంతా కామెంట్లు చేస్తున్నారు.