HomeNewsతెలంగాణలో కాంగ్రెస్ కు 70 సీట్లు.. కేసీ వేణుగోపాల్ ధీమా

తెలంగాణలో కాంగ్రెస్ కు 70 సీట్లు.. కేసీ వేణుగోపాల్ ధీమా

Published on

కేసీఆర్-కామారెడ్డి, గజ్వేల్
రేవంత్ రెడ్డి-కామారెడ్డి, కొడంగల్
ఈటల -గజ్వేల్, హుజూరాబాద్

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. లైన్లో ఉన్నవారికి నామినేషన్ వేసే అవకాశం.. 13న నామినేషన్ల పరిశీలన.. 15వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా తెలంగాణలో నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. తెలంగాణలో అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70 స్థానాల్లో గెలవబోతోందని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ ప్రచారం జరుగుతున్న తీరుపై చర్చించేందుకు హైదరాబాద్‌కు వచ్చి నేతలతో సమీక్ష జరిపారు.టికెట్‌ రాక భంగపడిన నేతల బుజ్జగింపు, మిగిలిన 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయన నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలిచ్చారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని, ఆ తరవాత అనేక పదవులుంటాయని, వాటిని టికెట్‌ రాని వారికే ఇస్తామని చెప్పాలన్నారు. పార్టీ ఒక్కో నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించినందున అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారాన్ని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనిపించిన సానుకూల వాతావరణమే ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోందని, 70 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నేరుగా రంగంలోకి దిగింది. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఖర్గేకి వివరించారు.

Latest articles

More like this