HomeNewsసీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం...బెల్ట్ షాపులు క్లోజ్

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం…బెల్ట్ షాపులు క్లోజ్

Published on

తెలంగాణలో వినూత్న పాలనకు రంగం సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు ఆరు హామీలు అమలుచేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్న సీఎం రేవంత్.. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని బెల్ట్ షాపుల క్లోజ్ కు ప్రణాళికలు చేస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2 వేల 620 వైన్స్ లు ఉన్నాయి వైన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచాయతీలు ఉన్నాయి.ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులున్నాయి. ఈ లెక్కన యావరేజ్ గా చూస్తే రాష్ట్రంలో లక్ష 10 వేలకు పైగా బెల్ట్ షాపులన్నాయి. 24 గంటల పాటు బెల్ట్ షాపుల్లో లిక్కర్ ను అమ్ముతుండటం, రాష్ట్రంలోని యువత ఎక్కువగా మద్యానికి బానిసగా మారటం, అనధికారికంగా బెల్ట్ షాపు యాజమానులు దందా చేస్తున్నారన్న ఆరోపణలతో బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెల్ట్ షాపు లు క్లోజ్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది.గ్రామాల్లో బెల్టుషాపులు తీసేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

Latest articles

More like this